TS POLITICS : సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ

0
22

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది.ఈ నేఫథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. శనివారం సీఎం నివాసంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తసుకుంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమ్మినేని ఓ దఫా చర్చలు జరిగాయి. కానీ ఇక్కడ సీపీఐఎం తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ప్రచారంలో సైతం స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ముగిసిపోగా మరో రెండు రోజుల్లో విత్ డ్రా చేసుకునేందుకు గడువు తీరనుండటంతో ముఖ్యమంత్రితో సీపీఎం నేతలు భేటీ కావడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.