IPL 2024: లక్నోకు బిగ్ షాక్.. ఫాస్ట్ బౌలర్ ఔట్

0
30

రేపు ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతుండగా లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. కొద్ది రోజులు కుటుంబంతో గడిపిన అనంతరం ఆయన ఐపీఎల్‌లో ఆడనున్నారు. కాగా ఇప్పటికే మార్క్ వుడ్ కూడా ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి గైర్హాజరీతో లక్నో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

గత రెండు సీజన్లలో ఆర్సీబీకి ఆడిన విల్లేను ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌.. రూ. 2 కోట్లతో దక్కించుకుంది. అయితే ఇప్పుడు అతడు 2024 సీజన్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌కు మాత్రం దూరమవనున్నాడు. రెండ్రోజుల క్రితమే పీఎస్‌ఎల్‌ ఫైనల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ తరఫున ఆడిన విల్లే.. అక్కడ్నుంచి నేరుగా యూకేకు వెళ్లాడు. విల్లే రెండో షెడ్యూల్‌ వరకైనా తిరిగొస్తాడా..? లేక సీజన్‌ మొత్తానికి దూరమవుతాడా..? అనేదానిపై స్పష్టత లేదు. లక్నో కూడా విల్లే రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్‌, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మొమ్మద్ అర్షద్ ఖాన్.