Delhi Liquor Scam: కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్

0
15

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. ఏప్రిల్ 9 వరకు జూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. ఈనెల 15న అరెస్ట్ అయిన కవిత ఇప్పటివరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. దీంతో ఢిల్లీలో ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఇవాళ ఈడీ కస్టడీ ముగియటంతో ఆమెను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు

అంతకు ముందు కవిత మధ్యంత బెయిల్ పిటిషన్ వేశారు. తన కొడుకుకి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత. ఏప్రిల్ 16 వరకు కవిత కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని..అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కవితను మరో 15 రోజులు రిమాండ్ కోరింది ఈడీ. కవిత బెయిల్ పిటిషన్ పై రిప్లై ఇచ్చేందుకు టైం కావాలని కోరింది ఈడీ. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కవితకు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. అలాగే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఏప్రిల్ 1న విచారించనుంది.