Delhi Politics: మార్మోగుతున్న కేజ్రీవాల్ పేరు.. జైలు నుంచే పాలనకు సీఎం రెడీ?

0
10

సీఎం పోస్టులో ఉన్న వ్యక్తి ఓ స్కాంలో అరెస్ట్ కావడం ఎప్పుడైనా సంచలనమే. ఐతే.. వారి పోరాటం మాత్రం ఆగదు. కొందరు నేరం కోర్టులో రుజువై జైలుకు వెళ్తున్నప్పుడు రాజీనామా చేస్తారు. మరికొందరు పరిస్థితులు ముందే గమనించి రిజైన్ చేస్తారు.

ఐతే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన జైలు నుంచే పరిపాలన చేస్తారని ఆప్ వర్గాలు ప్రకటించాయి. జైలు నుంచి పరిపాలన చేయాలంటే చట్టాలు ఏం చెబుతున్నాయి.. కస్టడీలో ఉన్నా.. జైలు శిక్ష పడినా సీఎంగా కొనసాగవచ్చా అనేదానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ చేస్తున్న ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. దీంతో ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి, సీఎంగా కొనసాగేందుకు చట్టప్రకారం అడ్డంకులుండవని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే నైతిక పరంగా అయితే అది కరెక్ట్ కాదు.అందుకే గతంలో అరెస్ట్ కావాల్సిన వారు ముందుగానే రాజీనామా చేశారు. అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతను అరెస్టు చేయవచ్చా అంటే.. చట్టపరమైన అడ్డంకులేమీ లేవని.. రాజ్యాంగపరమైన రక్షణ ఏదీ లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.