పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటి నుంచి యూత్ బాగా ఓ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నది. దీనిలో భాగంగా బైక్లపై నెంబర్ ప్లేటుకు బదులు ‘ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ’ అంటూ రాయించుకొని తిరుగుతున్నారు. అయితే దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. బుధవారం రాత్రి పిఠాపురంలో జరిగిన వారాహి సభలో దీని గురించి మాట్లాడుతూ.. ఎవరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నంబర్ ప్లేట్ పెట్టుకోవద్దని.. వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని.. అప్పుడు అది తన మీదకి వస్తుందని సరదాగా అన్నారు. కాబట్టి, యువత ఎవరైనా బైక్ రేసింగ్‌లు చేసుకోవాలనుకునే వారు తన రెండెకరాల స్థలంలో చేసుకోవచ్చని సూచించారు. కావాలంటే తన స్థలాన్ని రేసింగ్‌లకు అనుకూలంగా మార్చుతానని చెప్పారు. అందరికీ హెల్మెట్లు, సేఫ్ గార్డులు, ఇతర రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు పవన్ కళ్యాణ్. దీంతో అక్కడున్న జనం మొత్తం హోరెత్తేలా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Home పాలిటిక్స్ ఏపీ AP Politics: వైరల్ అయిన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా బైక్ల నెంబర్ ప్లేట్లు.. పవన్...