Tollywood: రెస్ట్ లేని ఎన్టీఆర్.. చదివితే దండం పెట్టేస్తారు

0
32

ఏడాదంతా కష్టపడే టాప్ హీరోలు.. సమ్మర్ లో రెస్ట్ తీసుకుంటుంటారు. ఫ్యామిలీతో జాలీగా గడుపుతుంటారు. కొంతమంది హీరోలు అప్పుడే… విహార యాత్రల్ని ప్లాన్ చేసేసుకొన్నారు. కానీ ఈ వేసవిలో ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోవడం లేదు. తన ‘దేవర’ సినిమాని వీలైనంత త్వరగా ముగించాలన్న తొందరలో ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా ప్రస్తుతం దేవరపైనే ఉంది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ పై ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చక చక సాగుతోంది. హైదరాబాద్‌లో కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ పార్ట్ దాదాపుగా పూర్తయ్యింది. ఈవారంలోనే చిత్రబృందం గోవా వెళ్లబోతోంది. అక్కడ ఎన్టీఆర్ – జాన్వీలపై ఓ పాటని, కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

దేవర మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 10న దేవర-1 విడుదల చేయనున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మూవీ టీజర్,గ్లింప్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండటం విశేషం.