క్రికెట్ మ్యాచులో కొందరు మాజీ ఆటగాళ్ల కామెంట్రీలు ఎప్పటికీ ప్రత్యేకమే. భారత్ నుంచి రవిశాస్త్రి, నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు, సెహ్వాగ్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా సిద్ధూ కామెంటరీ బాక్స్‌లో తనదైన శైలిలో వేసే ఛలోక్తులు నవ్వులు పూయిస్తాయి. ఈ IPL సీజన్‌కు కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇస్తున్న సిద్ధు తన ఫీజు ఎంతో వెల్లడించాడు. గతంలో టోర్నీ మొత్తం కామెంట్రీ చేస్తే రూ.60 నుంచి70 లక్షలు పారితోషికంగా ఇచ్చేవారు కానీ.. ఐపీఎల్‌లో రోజుకు రూ.25 లక్షలు తీసుకుంటున్నానని తెలిపాడు
ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా ఐపీఎల్‌పైనే ఉందన్నాడు నవ్ జ్యోత్ సింగ్. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లకు ఐపీఎల్ రూపంలో మంచి అవకాశం దొరికిందని.. ఇక్కడ రాణించి వచ్చే టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు ఎంపిక కావొచ్చన్నాడు.
ఐపీఎల్‌లో కేవలం డబ్బుతో మాత్రమే సంతృప్తి దొరకదని.. ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుందన్నాడు సిద్ధు. ఈ సీజన్ ఐపీఎల్ మార్చి 22న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, ఆర్సీబీ మధ్య జరగనుంది.