ED: ఇవాళ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టనున్న ఈడీ

0
16

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్​లో అరెస్టు చేసిన ఈడీ ఇవాళ డిల్లీలోని రౌస్ అవెన్యూకోర్టులో ప్రవేశ పెట్టనుంది. నిన్న స్పెషల్ ఫ్లైట్ లో అర్ధరాత్రి ఈడీ హెడ్ ఆఫీస్ కు చేరుకున్న కవిత రాత్రి అక్కడే బస చేసింది. ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ విధించారు. ఇవాళ కవితను సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కవిత అరెస్ట్​ను ఆమె లాయర్ మోహిత్ రావు ఖండించారు.

ఎప్పుడేం జరిగిందంటే?

నిన్న మధ్యాహ్నం 1:40 గంటలకు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలోని ఢిల్లీ ఈడీ బృందం కవిత ఇంటికి చేరుకుంది. ఈ బృందంలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు ఉన్నారు. ఈడీ విచారణ, సోదాలకు అంగీకరిస్తూ కవిత సంతకం చేశారు.
1:45 గంటలు: సోదాలు ప్రారంభం
5:20: కవితను అరెస్ట్ చేస్తున్నట్టు భర్త అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాతపూర్వకంగా సమాచారం.
6:30: కవిత వాంగ్మూలం రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
6:45: సోదాలు ముగింపు
7:00: ఇంట్లో నుంచి కవితను తీసుకుని బయటకొచ్చిన ఈడీ ఆఫీసర్లు
7:30: ఇంటి నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కవిత తరలింపు
8:10: ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఈడీ వాహనాలు