బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తనయ, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఈ.డి అధికారులు అరస్ట్ చేస్తారని మళ్ళీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈ.డి తో పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది అధికారుల బృందం ఈ రైడ్స్ లో పాల్గొంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ దాడులు జరగడం ప్రాధన్యం సంతరించుకుంది. మొత్తం నాలుగు టీంలు ఈ తనిఖీలలో పాల్గొన్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ.డి అధికారులు కవితను పలు మార్లు ప్రశ్నించడం జరిగింది. కానీ ఈసారి పరిస్థితి కొంత తీవ్రంగా ఉండొచ్చని బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కవితను అరెస్ట్ చేయొచ్చన్న ప్రచారం జరగడంతో వారంతా ఆమె నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులను భారీగా మోహరించారు.