పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : తనతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని ఆదివారం భువనగిరిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ అంటున్నాడని కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు వరకు సీఎం రేవంత్ ఉంటాడో లేదో తెలియదని.. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారని అన్నారు.. మరీ ఆ 20 మందిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారేమోనని మహేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను ప్రజలు నమ్మడం లేదని.. అందుకే దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తామంటున్నారు సరే.. ఆరు గ్యారెంటీల్లోని మిగతా హామీల సంగతేంటని ప్రశ్నించారు. మిగతా హామీల కోసం ఎంతమంది దేవుళ్ల మీద ఒట్లు వేస్తారని సెటైర్ వేశారు. హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
Home పాలిటిక్స్ తెలంగాణ TS POLITICS : ఆగస్టు వరకు సీఎం రేవంత్ ఉంటాడో లేదో తెలియదు- ఏలేటి మహేశ్వర్...