TG Politics: పార్టీ మారను.. ప్రణీత్ రావు ఎవరో తెలియదు: ఎర్రబెల్లి

0
26

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారని.. క్యాడర్ అవన్నీ నమ్మవద్దని చెప్పారు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా ఎర్రబెల్లి స్పందించారు. అసలు ప్రణీత్ రావు ఎవరో కుడా తెలియదన్నారు.తన పేరు చెప్పాలని ప్రణీత రావు మీద అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసే నాయకులు అధికార పార్టీలోకి పోతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.

కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందన్నారు ఎర్రబెల్లి.. ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు .. ఎన్నికల కోసమే డ్రామా చేశారన్నారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదన్నారు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనని ధ్వజమెత్తారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని.. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. కార్యకర్తలు దైర్యంగా ఉండాలని.. నాయకులు పోయినంత మాత్రాన ఏమి కాదన్నారు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే తా ము పోలీస్ స్టేషన్ లో కూర్చుంటామని చెప్పారు. గెలుపు, ఓటములు సహజమని.. ఎన్టీఆర్ లాంటి నాయకుడికి కూడా ఓటమి తప్పలేదన్నారు.