Ex MLA koneru Konnappa On Fire KCR: కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

0
11

మాజీ సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి కుట్ర చేశారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. తనను సంప్రదించకుండా కేసీఆర్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం బాధ కలిగిచిందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత ఎన్నికల్లో తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారని, కేసీఆర్ ను తీవ్రంగా దూషించారని చెప్పారు.

బీఆర్ఎస్, బీఎస్పీ కలయిక తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని తనను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారని వెల్లడించారు. ఈ నెల 13న కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కోనప్ప ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ లేదని.. తనకు టికెట్ వద్దన్నారు.

కాగా గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్ప పై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3 వేల ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు.