Ex-President Pratibha Patil hospitalised, condition stable: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు అస్వస్థత

0
16

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అస్వస్థతకు గురయ్యారు. మార్చి 14న రాత్రి పుణెలోని భారతీ హాస్పిటల్‌లో ఆసుపత్రిలో చేరారు. జ్వరం ఛాతిలో ఇన్ ఫెక్షన్ తో భాదపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. ఆమె భర్త దేవీసింగ్ షెకావత్ 2023 ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు.

ప్రతిభాపాటిల్‌ 1962లో మహారాష్ట్రలోని జాల్‌గావ్‌ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 వరకు వరుసగా నాలుగుసార్లు ఎద్లాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 నుంచి 90 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1991 సాధారణ ఎన్నికల్లో అమరావతి నుంచి ఎంపీగా గెలుపొందారు. 2007 నుంచి 2012 రాష్ట్రపతిగా ఉన్నారు.