శివరాత్రి పర్వదినం ప్రభావం తిరుమలపైనా పడింది. కాళహస్తి సహా ప్రముఖ శైవాలయాలు దర్శించుకున్న భక్తులు.. తమ తదుపరి డెస్టినేషన్ గా తిరుమలకు క్యూ కడుతున్నారు. తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. దర్శనం కోసం భక్తులు 15 కంపార్ట్‌మెంట్లలో క్యూలో నిల్చున్నట్లు ఆలయ అధికారులు నివేదించారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శుక్రవారం మొత్తం 63,831 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండగా, 25,367 మంది భక్తులు తలనీలాల క్రతువులో పాల్గొన్నారు.
వేంకటేశ్వరుడి ప్రత్యేక దర్శనం ధర రూ.300 టికెట్ తో మూడు గంటల్లో పొందవచ్చు. అదే సమయంలో, 7 కంపార్ట్‌మెంట్లలో SSD దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు వారి కేటాయించిన సమయ స్లాట్ కోసం 5 గంటలపాటు వేచి ఉన్నారు. ఇది ఆలయంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం డిమాండ్‌ను హైలైట్ చేస్తుంది. శ్రీవారి హుండీకి నైవేద్యాలు సమర్పించడం ద్వారా రూ.3.36 కోట్లు గణనీయమైన ఆదాయం వచ్చింది.
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని వివిధ రకాల పూలతో పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నైనానందకరంగా ముస్తాబు చేశారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందంటున్నారు పంతుళ్లు. స్వామి,అమ్మ వార్ల దర్శనార్థం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం ఓంకార నామస్మరణలతో మారుమ్రోగుతోంది.