Telangana: బార్‎లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

0
7

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ బార్‎లో షార్ట్ సర్క్యూట్‎తో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బార్‎లోని ఖరీదైన మద్యం బాటిల్స్ అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లు తెలుస్తుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బార్ యజమాని తెలిపారు.