పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటులో లేకపోవడంతో గృహనిర్మాణ రంగంతో పాటు దీనిపై ఆధార పడిన కార్మికులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పీలో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో జూలై 8 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని.. మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా ఈ ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి రవాణా ఛార్జీల నిర్ణయం కలెక్టర్ల కమిటీ ఆధ్వర్యంలో జరుగనున్నట్లు తెలుస్తుంది.