Full Demand: కొత్త బండ్లకు ఇకనుంచి TG కోడ్.. ఫ్యాన్సీ నంబర్లకు పుల్ గిరాకీ

0
21

తెలంగాణ రిజిస్ట్రేషన్ కోడ్ మారింది. మార్చి 14, 2024 గురవారం నుంచి ఈ కోడ్ అమలులోకి వచ్చింది. తెలంగాణలో శుక్రవారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్స్‌ టీజీ పేరుతో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గెజిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచే టీజీ 0001 సిరీస్ పేరిట వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆయా జిల్లాలకు కేటాయించిన కోడ్‌తో ఈ వాహన రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటివరకు టీఎస్‌ పేరిట జరిగిన వాహనాలు యథావిధిగా కొనసాగుతాయి. నూతన వాహనాలకే టీజీ నెంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

2014 జూన్‌ 2 తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కొత్త వాహనాలకు TS పేరుతో వాహన రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గత ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఉద్యమం సమయంలో కేసీఆర్ వాహనాలపై ఏపీ తీసేసి టీజీ అని రాసుకోవాలన్న క్యాంపెయిన్ నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని టీఎస్ గా మార్చారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం అంగీకరించడంతో అమల్లోకి వచ్చింది.ఇప్పటికే

నెంబర్లు రిజర్వ్‌ చేసుకున్న వారికి మాత్రం మార్చి 29 వరకు సమయం ఉంటుంది. నేటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వాహనాలకు టీజీ 0001 కేటాయించనున్నారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ పరిధిలో చూసుకున్నట్టయితే.. టీజీ 09 ఏఏ 0001 నెంబర్‌ రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎవరికి దక్కుతుంది.. ఈ ఫ్యాన్సీ నంబర్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.