Gas Cylinder Theft CCTV : దర్జాగా కారులో వచ్చి.. గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిండు

0
27

హైదరాబాద్ దర్జాగా కారులో వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై పార్క్ చేసిన ట్రాలీ నుంచి గ్యాస్ సిలెండర్ ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సీసీ పుటేజ్ లో రికార్డ్ అయింది. సికింద్రాబాద్ లోని మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్లాడు. అదే టైంలో అక్కడకు కారులో వచ్చిన యువకుడు.. ట్రాలీ వద్ద ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని సిలిండర్ తీసుకుని కారులో పారిపోయాడు.
కాసేపటికి ట్రాలీ వద్దకు చేరుకున్న డ్రైవర్ సిలిండర్ తక్కువ ఉండటం గమనించాడు. అక్కడ ఉన్న వారిని ప్రశ్నించగా తెలియదని చెప్పారు. అనుమానంతో సీసీ ఫుటేజ్ పరి శీలించగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.