వైసీపీ సోషల్ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చే మహిళ గీతాంజలి చనిపోవడంపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా… హత్యచేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అసలు విషయం బయటకు రావాలంటే..ఆమె ఫోన్ దొరకాలి. కానీ ఆమె ఫోన్ కనిపించడం లేదు. రైలు ప్రమాదం జరిగిన చోట ఫోన్ దొరకలేదు. ఎవరైనా దొంగతనం చేసి ఉంటే ఇలాంటి ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకోవడం పోలీసులకు పెద్ద పని కాదు. ఇప్పుడా ఫోన్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గీతాంజలి ఫోన్ మిస్ అయిందని ఆమె భర్త చెబుతున్నారు. ఆమె ఫోన్ దొరికితే మొత్తం మిస్టరీ వీడిపోతుందని పోలీసుల అంచనా. ఇప్పుడా ఫోన్ మిస్ కావడమే సంచలనంగా మారింది. ఎవరు మిస్ చేశారు.. అందులో ఉన్న విషయాలు బయటపడితే ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది తేలాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ ఎక్కువ హడావుడి చేస్తున్నారు. ఆమె టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల వల్లే ఆత్మహత్య చేసుకుందని చెప్పేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
ఫోన్ దొరికితే మొత్తం కథ బయటకు వస్తుంది. గీతాంజలిని చంపేశారా… ఆత్మహత్య చేసుకుందా అనేది తేలుతుంది. ఆత్మహత్య అయితే.. ఎందుకు కారణమో కూడా ఫోన్ వివరాలతో బయటపడే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులుఒక వైపే చూడాలనే ఒత్తిడి ఉంటుంది. కానీ నిజాలు బయటపడే పరిస్థితులు చాలా వేగంగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.