Gold: బంగారం ఆల్ టైమ్ రికార్డ్..తులం ఎంతంటే.?

0
19

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,610 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,390కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

యూఎస్​ ఫెడ్​ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకాయి. చైనా నుంచి బలమైన డిమాండ్ వల్ల ధరలు పెరుగుతున్నాయని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్‌‌లోని రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు.

ఎంసీఎక్స్​లో ఫ్యూచర్స్ ట్రేడ్‌‌లో, జూన్ కాంట్రాక్ట్ బంగారం ధర10 గ్రాములకు రూ.978 పెరిగి రూ.68,679కి చేరుకుంది. మే నెల కాంట్రాక్టు వెండి కిలో రూ.763 పెరిగి రూ.75,811కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో, స్పాట్ కమోడిటీ ఎక్స్ఛేంజ్​ బంగారం ధరలు ఔన్స్‌‌కు 2,265.73 డాలర్ల వరకు పెరిగాయి.