Good News: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.10వేలు!

0
10

అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది. ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఈసీ అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా.

మరో వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఈ సీజన్‌లో 60-70లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి మద్దతు ధర గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ. 2,203, సాధారణ రకానికి రూ. 2,183గా ఉంది. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి.

రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలను సాగుచేస్తే, వాతావరణం అనుకూలించకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరికొన్ని రోజుల పాటు ఈదురు గాలులు, వానలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుండడం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. విపరీతంగా గాలి ప్రభావం ఉన్నా, వానలు ఎక్కువైనా దిగుబడి పడిపోతుందని హార్టికల్చర్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నరు.