పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: మందుబాబులకు ఏపీ సర్కారు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో నాన్ బ్రాండ్ లిక్కర్ సేల్స్‌పై గతంలో తీవ్ర విమర్శలు రాగా ఆ అంశంపై కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఏపీలో మళ్లీ కింగ్ ఫిషర్ బీరును అందుబాటులోకి తెచ్చారు. తాజాగా కేఎఫ్ బీర్లను కంటైనర్లలో తీసుకొచ్చి గోడౌన్లలో నిల్వ చేశారు. త్వరలోనే స్టేట్ వైడ్‌గా బ్రాండెండ్ మద్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ పవర్‌లోకి రాగానే బ్రాండెండ్ మద్యం స్థానంలో గుర్తింపులేని మద్యం అమ్మకాలను ప్రోత్సహించింది. ఇది పెద్ద స్కామ్ అంటూ గతంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాగా మళ్లీ తమ ఫేవరేట్ బీర్లు ఏపీలో అందుబాటులోకి రావడంతో లిక్కర్ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.