తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. పవన్ మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందని.. ఆయనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. తన మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని… ఇక్కడ ఎన్నో అభివృద్ధి. సేవా కార్యక్రమాలు చేశానని చెప్పారు.తనను తరిమేయాలని పవన్ అనడం ఆశ్చర్యంగా ఉంది. నాలుగేళ్లలో జనసేనాని భీమవరం ఎప్పుడైనా వచ్చారా? ప్రజల బాగోగులు చూశారా? అని ప్రశ్నించారు.
సౌమ్యుడు, వివాదరహితుడైన చిరంజీవికి.. పవన్‌కు అసలు పోలికే లేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారు. పవన్‌కు లాగా సంస్కారం లేక విమర్శలు చేయలేక రాజకీయాల నుండి వెళ్ళిపోయారని తెలిపారు. మరో సొంత అన్న నాగబాబుకి కూడా పవన్ అన్యాయం చేశారు.
2019లో ఓటమి తర్వాత పవన్ మళ్లీ భీమవరం వైపు చూడలేదని విమర్శించారు గ్రంథి శ్రీనివాస్. కోవిడ్ సమయంలో కూడా ఇక్కడి ప్రజల్ని ఏమయ్యారో అని పట్టించుకోలేదన్నారు. పవన్ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగారంటూ ధ్వజమెత్తారు. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర పవన్ తాకట్టు పెట్టారంటూ ధ్వజమెత్తారు.