Hanuman Movie OTT Release Date : ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ క్లోజింగ్ కలెక్షన్లు, ఓటీటీ రిలీజ్ అప్ డేట్స్

0
16

‘హనుమాన్’ సినిమా OTT రిలీజ్ కు రెడీ అయింది. మార్చి 8న జీ5లో రాబోతోంది. ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ అని ఇప్పటికే ప్రకటించడంతో OTT రెస్పాన్స్ కూడా ఈ చిత్ర బృందానికి చాలా కీలకం. శ్రీరామ నవమికి సీక్వెల్ మూవీ జై హనుమాన్ ​​ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందంటోంది చిత్ర యూనిట్. శనివారం 50రోజుల వేడుక సందర్భంగా కీలక అంశాలు మీడియాతో పంచుకున్నారు మూవీ మేకర్స్.

సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజై 9 దశాబ్దాల సీజన్ రికార్డునే తిరగరాసిన తెలుగు సినిమా హనుమాన్. ప్యాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది హనుమాన్ సినిమా. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో సినిమా థియేట్రికల్ రన్ ను ఆల్మోస్ట్ ముగించింది.

మీడియం బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద స్టార్ హీరోల చిత్రాల తరహాలో వసూళ్లు రాబట్టింది. నైజాంలో హనుమాన్ 64 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా 82 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 24 కోట్ల గ్రాస్, కేరళ- తమిళనాడులో కలిపి దాదాపు 4 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. నార్త్ ఇండియాలో ఈ సినిమా 62 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హనుమాన్ సినిమా ఇండియాలో 237 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ లో 57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ గ్రాస్ 294 కోట్లని టీమ్ తెలిపింది.