TS POLITICS : రాజీనామా లేఖతో రెడీగా ఉండు అన్న సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయడం పక్కా అని రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని రెడీగా ఉండు అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి రాజీనామా లేఖతో వస్తా అని నువ్వు వస్తావా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దాం.. ఆగస్టు 15లోగా మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి, రుణమాఫీ చేస్తే.. వారు నా రాజీనామా లేఖను స్పీకర్‎కు ఇస్తారని చేయలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్‎కు పంపుతారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.