Shreyanka Patil WPL: విరాట్‌లా ఉండాలని కలలు కంటూ పెరిగా : శ్రేయాంక పాటిల్

0
26

యూత్ క్రష్ శ్రేయాంక పాటిల్ తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిసి సంతోషం వ్యక్తం చేశారు. ‘అతడి వల్లే క్రికెట్ చూడటం ప్రారంభించా. విరాట్‌లా ఉండాలని కలలు కంటూ పెరిగా. గత రాత్రి అతడిని కలిసిన క్షణం నా జీవితంతో మరిచిపోలేనిది. విరాట్.. హాయ్ శ్రేయాంక అని పలకరించారు. బాగా బౌలింగ్ చేశానని ప్రశంసించారు. నిజానికి నా పేరు కోహ్లీకి తెలుసు’ అంటూ శ్రేయాంక ట్వీట్ చేశారు.

శ్రేయాంకా పాటిల్‌ఈ అమ్మాయి గురించే నెట్టింట చర్చ జరుగుతోంది. ఇటీవల ముగిసిన డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. 3.3 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టింది. కప్పు కల నెరవేర్చిన ఈ 21 ఏళ్ల అమ్మాయిని ఫ్యాన్స్‌ ‘ఆర్సీబీ క్వీన్‌’ అని పిలుస్తున్నారు. అంతేగాక టోర్నీలో 13 వికెట్లు సాధించిన ఆమె అత్యధిక వికెట్ల వీరవనితగా రికార్డు సాధించింది. పర్పుల్ క్యాప్‌తో పాటు ‘ఎమెర్జింగ్ ప్లేయర్’ అవార్డు సొంతం చేసుకుంది.

మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్‌గా కోహ్లీ

దేశంలోనే మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్‌గా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచినట్లు ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. అతడి తర్వాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, క్రిస్టియానో రొనాల్డో, సచిన్, లియోనల్ మెస్సీ, నీరజ్ చోప్రా, సునీల్ ఛెత్రీ నిలిచారు. దేశంలోనే మోస్ట్ పాపులర్ స్పోర్ట్‌గా క్రికెట్ నిలిచింది. క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, హాకీ ఉన్నాయి.