పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని టాస్క్‌ఫోర్స్, పోలీసు సిబ్బందికి విస్తృతంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ పెడ్లర్ల ఆట కట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అయితే, మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ వీదేశి ప్రయాణికుడు అక్రమంగా తీసుకొస్తున్న 1,472 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన కొకైన్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 22 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.