AP Politics: టీడీపీలోకి హీరో నిఖిల్..అసలేం జరిగిందంటే?

0
19

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో నారా లోకేశ్‌​తో నిఖిల్‌ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నిఖిల్‌ టీడీపీలో చేరలేదని ఆయన పీఆర్‌ టీమ్‌ తెలిపింది.ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఉంటానని చెప్పేందుకే పసుపు కండువా కప్పుకున్నారని చెప్పడం గమనార్హం.

అంతకుముందు చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందినందుకు మావయ్య ఎమ్ఎమ్ కొండయ్య యాదవ్​‌కు అభినందనలు, అలాగే ధన్యవాదాలు. తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన టీడీపీకి కృతజ్ఞతలని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్​కు నిఖిల్ దగ్గరి బంధువు. కొండయ్య యాదవ్​కు నిఖిల్‌ అల్లుడు వరుస అవుతారు.

నిఖిల్‌ నటించిన స్పై గతేడాది విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్వయంభు కోసం వర్క్‌ చేస్తున్నారు. భరత్‌ కృష్ణమాచారి డైరెక్షన్ చేస్తున్న మూవీలో సంయుక్త హీరోయిన్. ఇటీవల కార్తికేయ 3 కూడా అనౌన్స్‌ చేశారు.