TS Government Holidays: ఇవాళే లాస్ట్.. రేపటి నుంచి హాలిడేస్

0
17

ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఇవాళే ఆఖరి రోజు. ఇవాళ్టి నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరో వైపు ఇంటర్​ విద్యార్థుల ఆన్సర్ షీట్ల వాల్యువేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా సుమారు 60 లక్షల ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ చేసేందుకు 16 వాల్యుయేషన్ సెంటర్లను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.

ఫస్ట్ స్పెల్ లో ప్రారంభమైన తెలుగు, హిందీ, పొలిటికల్ సైన్స్ తదితర సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది. మిగిలిన సబ్జెక్టుల ప్రక్రియ కొనసాగుతోంది. వాల్యుయేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. జూన్ లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.