T20 WorldCup Free: గుడ్ న్యూస్: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూడొచ్చు

0
15

క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఈ ఏడాదిలో జరిగే అంతర్జాతీయ టీ20 వరల్డ్ కప్ ను డిస్నీ+ హాట్‍స్టార్ ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రపంచకప్ కోసం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని వెల్లడించింది.మొబైల్ యాప్ యూజర్లకు ఈ అవకాశం కల్పించనుంది.

అయితే టీవీలో చూడటానికి మాత్రం డబ్బు చెల్లించాల్సిందే. ఐపీఎల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023లను జియో సినిమా ఫ్రీగా ప్రసారం చేసిన విషయం తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియోతో పాటు స్పోర్ట్స్ 18 కూడా క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తోంది. కాగా జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాల మధ్య ఈసారి టీ20 ప్రపంచకప్ జరగనుంది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

టీమిండియా తమ లీగ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలో ఆడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ 5న ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ ఆడనుంది భారత్.