How Much Strength In Chevella: చేవెళ్లలో కాసాని ఖలేజా ఎంత.?

0
12

చేవేళ్లలో ప్రధాన పార్టీలు తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ రావు పేరును ప్రకటించింది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునితా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

చేవేళ్లలో త్రిముఖ పోరు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తప్పుకోవడం.పట్నంమహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది. ముదిరాజ్ వర్గానికి చెందిన కాసాని జాతీయ అభ్యర్థులకు పోటీ ఇస్తాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్ ,బీజేపీ మధ్యే అని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం మోడీ హవా కొనసాగడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం,జాతీయ పార్టీలకు కలిసి వస్తున్నాయి.

కాసాని ప్రస్థానం
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాచుపల్లిలో 1954, ఆగస్ట్ 19న జన్మించారు. 2001-06 రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్, 2007-11 MLCగా పని చేశారు. 2007లో మన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 2009లో ‘ప్రజారాజ్యం’తో పొత్తు పెట్టుకున్నారు. 2022లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన BRSలో చేరారు. BRS అధిష్ఠానం బుధవారం చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది.