పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధం అనేక మంది కాపురాల్లో చిచ్చు రాజేస్తోంది. తాజాగా, హైదరాబాద్ ముషీరాబాద్ ఎస్‌ఆర్టీ కాలనీకి ప్రవీణ్ తన ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు చిక్కాడు. ప్రియురాలు, భర్తను నిలదీయంతో ప్రవీణ్ కోపంతో భార్య, కొడుకులపైనే విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రవీణ్ ప్రియురాలికి ముందే పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. భర్త ప్రవీణ్ దాడి చేయడంతో భార్య మెర్సీ పోలీసులను ఆశ్రయించగా అంబర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.