TG Government: అలర్ట్.. ప్రజాభవన్ లో ప్రజావాణి రద్దు..ఎందుకంటే.?

0
24

లోక్‌‌‌‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు నోడల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ దివ్య దేవరాజన్‌‌‌‌ వెల్లడించారు. జూన్‌‌‌‌ 7వ తేదీ నుంచి తిరిగి యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. అప్పటివరకు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌తో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం సమస్యలను పరిష్కరించేందుకు.. పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లడంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజా భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒక్కో రోజు ఒక్కో శాఖకు చెందిన మంత్రులు ప్రజావాణిలో పాల్గొంటారు. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.