Ileana: తన భాగస్వామిపై ఇలియానా కామెంట్స్ వైరల్

0
39

జఘన సుందరి ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలింది. త్రివిక్రమ్ సహా ఎందోర డైరెక్టర్లు ఆమెకు బంపర్ హిట్లు ఇచ్చారు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కొన్నేళ్ల పాటు గ్లామర్ హీరోయిన్ గా ఆకట్టుకుంది.

తెలుగులో కాదు సౌత్, అటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఇలియాన్. కొత్త తరం రావడంతో.. సినిమాల నుంచి ఫేడవుట్ అయింది. సడెన్ గా అప్పట్లో ప్రెగ్నెన్సీని ప్రకటించడం ఓ సంచలనం గా చెప్పుకోవచ్చు. పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిందంటూ ఇలియానాకు సంబంధించిన వార్తలు నెటింట తెగ చెక్కర్లు కొట్టాయి. గతేడాది ఈ బ్యూటీ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు కోవా ఫినిక్స్ డోలన్‌ పుట్టిన తర్వాత భాగస్వామిని పరిచయం చేసింది. తన ప్రియుడు.. భాగస్వామి.. మైకల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

తన ఇష్టాఇష్టాలను మైఖేల్ ఎంతో గౌరవిస్తాడని.. తన కొడుకు రాకతో వారిద్దరి జీవితాలు ఆనందంగా మారాయని వివరించింది. అయితే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో అమ్మ తనకు అండగా నిలిచిందని.. డెలివరీ తర్వాత ఒత్తిడికి లోనైతే తన భాగస్వామి మైఖేల్ సపోర్ట్ అందించాడని చెప్పుకొచ్చింది. మైకేల్ తో బంధం గురించి పబ్లిక్ గా చెప్పేందుకు తనకు ఇష్టం లేదని.. అలా గతంలో ఓసారి చెప్పి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది ఇలియానా. నా గురించి ఏం మాట్లాడినా నేను భరిస్తా.. అసలు వారి మాటలను పెద్దగా పట్టించుకోను.. అయితే నా భాగస్వామి గురించి కుటుంబం గురించి ఎవరైనా విమర్శిస్తే అసలు ఊరుకోలేను అంటూ ఇలియానా చెప్పడం విశేషం.