IND vs ENG : ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ జైస్వాల్

0
20

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో అద్భుత ప్రదర్శనకుగానూ టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఇందుకుగానూ ఆయన రూ.2.50 లక్షలు దక్కించుకున్నారు. ఈ సిరీస్ లో జైస్వాల్ 89.00 యావరేజ్ తో ఏకంగా 712 రన్స్ బాదారు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, మూడు అర్థ శతకాలు ఉన్నాయి. సిరీస్ లో జైస్వాల్ అనేక రికార్డులు కూడా కొల్లగొట్టారు.

ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు (712) సాధించిన భారత బ్యాటర్‌గా జైస్వాల్‌ నిలిచాడు. అలాగే ఒకే జట్టు (ఇంగ్లండ్‌)పై ఎక్కువ సిక్సర్లు (26) బాదిన భారత బ్యాటర్‌గానూ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్‌ (ఆసీస్‌పై 25) రికార్డును బ్రేక్ చేశాడు.

టెస్టుల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (16)లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్‌ నిలిచాడు . ఈ లిస్టులో వినోద్‌ కాంబ్లీ (14) టాప్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఒకే టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున ఎక్కువ పరుగులు (712) సాధించిన రెండో బ్యాటర్‌ గా జైస్వాల్‌ నిలిచాడు. అంతకుముందు గవాస్కర్‌ (విండీస్‌పై 774, 732) పరుగులు చేసి ముందున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును (ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ ల్లో అత్యధిక పరుగుల 656) బద్దలు కొట్టి చెరిపేశాడు