Delhi Politics: ఫ్రీ కరెంట్.. దేశానికి కేజ్రీవాల్ 6 గ్యారంటీలు

0
32

తన భర్త సింహమని, ఆయన్ను జైల్లో ఎక్కువ కాలం ఉంచలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో తన భర్త పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ‘కేజ్రీవాల్ అనే నేను నాకు ఓటు వేయాలని మిమ్మల్ని కోరడం లేదు. కొత్త ఇండియా కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. భరతమాత బాధలో ఉంది. ప్రతిపక్ష కూటమికి ఛాన్స్ ఇవ్వండి. కొత్త ఇండియాను నిర్మిస్తాం’ అని తెలిపారు.

కేజ్రీవాల్ గ్యారంటీలు

1. దేశమంతటా 24×7 విద్యుత్ సరఫరా
2. పేద వర్గాలకు పూర్తిగా ఉచిత విద్యుత్
3. ప్రతి గ్రామం, లొకాలిటీలో
అద్భుతమైన ప్రభుత్వ బడులు
4. ప్రతి గ్రామం, లొకాలిటీలో మొహల్లా క్లినిక్ లు
5. స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం అన్ని పంటలకు తగిన ఎంఎస్పీ
6. ఢిల్లీకి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా

ఈసీకి ఇండియా కూటమి 5 డిమాండ్లు ఇవే..

1. లోక్ సభ ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలి. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల విషయంలోనూ సమానంగా వ్యవహరించాలి.
2. ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులను వెంటనే ఆపివేయించాలి.
3. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను వెంటనే జైలు నుంచి విడుదల చేయించాలి.
4. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ఆర్థిక వనరులను దెబ్బ తీసే ప్రయత్నాలను వెంటనే ఆపివేయించాలి.
5. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాలోకి భారీగా ఫండ్స్ చేరడంపై దర్యాప్తు చేపట్టాలి. ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేయాలి.