ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ ‘ఇన్నింగ్స్ 64 పరుగుల’ తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ 218 పరుగులు చేయగా భారత్ 477 పరుగులతో దీటుగా బదులిచ్చింది. 259 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 పరుగులకే ఆలౌట్ అయింది.
జో రూట్ (84) రాణించగా.. జానీ బెయిర్‌స్టో (39) ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత చెలరేగాడు. టాప్ -3 బ్యాటర్లను ఔట్ చేశాడు. మొత్తంగా 5 వికెట్లు తీశాడు. దీంతో టెస్టు సిరీస్ భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారత్ తో 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘోరంగా విఫలం అయ్యారు. 10 ఇన్నింగ్స్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశారు. స్టోక్స్ స్కోర్లు చూస్తే 70&6, 47&11, 41&15, 3&4, 0&2గా ఉన్నాయి. సారథికి తోడు మిగతా ప్లేయర్లూ అంతగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ ఘోర ఓటములు మూటగట్టుకుంది.