ధర్మశాలలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదో టెస్టులో సెకండ్ డే భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 135 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన రోహిత్,శుభ్ మన్ గిల్ అదరగొడుతున్నారు. శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ ఒక వికెట్ నష్టానికి 197 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 61, రోహిత్ 75 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 21పరుగుల వెనుకంజలో ఉన్నారు.
తొలి రోజు భారత్ పై చేయి సాధించింది. ఫస్ట్ డే భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ ను దెబ్బతీశారు. కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4 వికెట్లు, జడేజా ఒక వికెట్ తో చెలరేగారు. దీంతో ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌటైంది. క్రాలే 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా మిగిలిన ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు. ఒక దశలో వికెట్ నష్టానికి 100 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్ 118 పరుగుల వ్యవధిలో 9 వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఫస్ట్ డే ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది.