టీ20వరల్డ్ కప్ లో భారత్ గెలవాలంటే స్టార్ బ్యాటర్ కోహ్లీ కచ్చితంగా జట్టులో ఉండాలని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘గత టీ20వరల్డ్ కప్ లో టీమ్‌ను సెమీస్‌కు చేర్చింది కోహ్లీనే. అతడు జట్టులో ఉండడని చెప్పిందెవరు? ఈ రూమర్స్ క్రియేట్ చేసే వారికి వేరే పనేం లేదా? దేన్ని ఆధారంగా చేసుకుని వారు ఇది చెబుతున్నారు?’ అని ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు.
2011 వరల్డ్‌కప్‌లో సచిన్ తెందూల్కర్‌కు దక్కిన గౌరవం ఇప్పుడు విరాట్‌కు కూడా దక్కాల్సిందేనని నమ్ముతున్నానని చెప్పారు. విరాట్ కోసం టీమ్ఇండియా ప్రపంచకప్ నెగ్గాలని… తన కెరీర్లో అది అతి పెద్ద విషయమని తెలిపారు. కాగా టీ20 జట్టులో కోహ్లీ ఉండడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్కప్ వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్త వేదికలుగా జరగనున్న నేపథ్యంలో అక్కడి స్లో పిచ్‌లపై విరాట్ బ్యాటింగ్ సరిపోదని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఇక 2022 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ అదరగొట్టాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. కానీ, ఆ తర్వాత టీమ్ఇండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మేనేజ్మెంట్ టీ20 ఫార్మాట్‌కు విశ్రాంతినిచ్చింది. దాదాపు 14 నెలల తర్వాత ఈ ఇద్దరూ 2024 జనవరిలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చారు