Indian Politics: మోడీకి ఢీకొట్టేందుకు రాహుల్ 25 భారీ హామీలు

0
20

పవర్ ఫుల్ ప్రధానమంత్రిగా ప్రపంచం వేనోళ్ల పొగుడుతున్న వేళ నరేంద్రమోడీని ఢీకొట్టేందుకు రాహుల్ గాంధీ పవర్ పుల్ హామీలతో వస్తున్నారు. కాంగ్రెస్ ఆకర్షణీయ మేనిఫెస్టోలో 25 అంశాలను చేర్చినట్టు తెలుస్తోంది. పదేళ్ల మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన, అన్యాయంతో దేశవ్యాప్తంగా ప్రజలు విసిగిపోయారని, భారతదేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీడబ్ల్యూసీ మీటింగ్ సందర్భంగా చెప్పారు.

దేశంలో మార్పు తెచ్చేందుకు కాంగ్రెస్ నాంది పలుకుతుందని ఖర్గే చెప్పారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే మాట్లాడారు. దీనికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. తన ప్రారంభ వ్యాఖ్యలలో.. దేశం మార్పును తీవ్రంగా కోరుకుంటోందని ఖర్గే అన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు 2004 నాటి ‘ఇండియా షైనింగ్’ నినాదం మాదిరిగానే వస్తాయని ఆయన అంచనా వేశారు.

63 రోజుల పాటు సాగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగమైనకిసాన్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ , హిస్సేదారి న్యాయ్ వంటి హామీలు, కట్టుబాట్లకు సంబంధించి ఐదు హామీలు ఉంటాయని తెలిపారు ఖర్గే. దేశవ్యాప్తంగా 25 హామీలు, రాబోయే ఐదేళ్లపాటు పార్టీ ప్రభుత్వ అజెండాపై న్యాయానికి సంబంధించిన ఐదు కట్టుబాట్లను వివరించాల్సిన అవసరాన్ని ఖర్గే నొక్కి చెప్పారు. మేనిఫెస్టో కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదని, భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రల సందర్భంగా వేలాది మందితో చర్చల ఆధారంగా రూపొందించిన రోడ్‌మ్యాప్ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి తీర్మానానికి ఐదు హామీలతో ‘ఐదు న్యాయ తీర్మానాలు’ అజెండాపై కాంగ్రెస్ ఎన్నికల్లో పోరాడుతుందని, ప్రతి భారతీయుడి జీవితాన్ని స్పృశించేలా ’25 హామీలు’ ఉంటాయని రాహుల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా నిలుస్తాయని అన్నారు.