International Cricket: టీ20 వరల్డ్ కప్ లో కొత్త రూల్.. కెప్టెన్లకు కష్టమే.

0
18

ఇంటర్నేషనల్ క్రికెట్ లో మరో కొత్త రూల్ అమల్లోకి తెచ్చేందుకు ఐసీసీ సిద్దమయ్యింది. వన్డే, టీ20ల్లో స్టాప్‌‌‌‌ క్లాక్‌ రూల్‌‌‌‌ను ఐసీసీ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ట్రయల్స్‌‌‌‌లో ఉన్న ఈ నిబంధన వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ నెలలో ఆరంభం కానున్న టీ20 ప్రపంచ కప్ నుంచి ఈ నిబంధనను ఐసీసీ అమలు చేయనుంది.

ఈ రూల్‌‌‌‌ ప్రకారం బౌలింగ్‌‌‌‌ జట్టు ఒక ఓవర్‌‌‌‌ పూర్తయిన 60 సెకండ్లలో తర్వాతి ఓవర్‌‌ను ప్రారంభించాలి. మూడోసారి కూడా అలాగే రూల్ ఉల్లంఘిస్తే బౌలింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌కు 5 రన్స్‌‌‌‌ పెనాల్టీ వేస్తారు. ఈ స్టాప్‌‌‌‌ క్లాక్‌‌‌‌ రూల్‌‌‌‌ వల్ల వన్డేల్లో దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని ఐసీసీ తెలిపింది.

ఈ రూల్‌‌‌‌ను అమలు చేసేందుకు థర్డ్‌‌‌‌ అంపైర్‌‌‌‌ పర్యవేక్షణలో గ్రౌండ్‌‌‌‌లో ఎలక్ట్రానిక్‌‌‌‌ క్లాక్‌‌‌‌ను ఉంచుతారు. ఇందులో కౌంట్‌‌‌‌డౌన్‌‌‌‌ 60 నుంచి మొదలై జీరోకు వస్తుంది. ఆ లోగా కొత్త ఓవర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమల్లో కొన్ని మినహాయింపు ఉంటుంది.

టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో సెమీఫైనల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లకు రిజర్వ్‌‌‌‌ డే ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల ఫలితాన్ని తేల్చేందుకు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో కనీసం 10 ఓవర్లు బౌలింగ్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది.