IPL 2024: ఐపీఎల్ లో తెలుగోళ్లు సత్తా చాటేనా.?

0
14

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సమరం మొదలుకానుంది. అయితే ఈ సీజన్‌లో తెలుగోడి సత్తా ఏంటో చూపించేందుకు ఏడుగురు ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన షేక్ రషీద్, నితీశ్ కుమార్ రెడ్డి, కోన శ్రీకర్ భరత్, మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, రిక్కీ, ఆరవెల్లి అవినాశ్ ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

గెలిచేదెవరు.?

ఇవాళ చెపాక్ మైదానంలో చెన్నై, బెంగళూరు మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై 20, బెంగళూరు 10 మ్యాచులు గెలవగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. చెన్నై, ఆర్‌‌‌‌సీబీ మ్యాచ్‌‌కు ముందు చెపాక్ స్టేడియంలో రైస్‌‌ యాజ్‌‌ వన్‌‌ పేరిట కలర్‌‌‌‌ఫుల్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌‌, బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్‌‌‌‌ ష్రాఫ్‌‌, సింగర్‌‌‌‌ సోనూ నిగమ్‌‌ తమ ఆటాపాటతో ఫ్యాన్స్‌‌కు ట్రీట్ ఇవ్వనున్నారు. ఇన్నింగ్స్ బ్రేక్ లో ప్రముఖ స్వీడిష్ డీజే ఆక్స్‌‌వెల్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేయనున్నాడు.

ఈ సీజన్ లో కొత్త రూల్

గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా పది జట్లు బరిలో నిలిచాయి. ఒక్కో టీమ్ 14 మ్యాచ్‌‌లు ఆడనుంది. లీగ్‌‌లో మొత్తం 74 మ్యాచ్‌‌లు జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతానికి తొలి 17 రోజుల్లో జరిగే 21 మ్యాచ్‌‌ల షెడ్యూల్‌‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఈ సీజన్‌‌ మొత్తాన్ని దేశంలోనే నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఈ సీజన్‌లో కొత్తగా ఓవర్‌‌‌‌కు రెండు బౌన్సర్లు అనుమతిస్తారు. దీంతో బ్యాట్‌‌కు, బాల్‌‌కు మధ్య సమాన పోటీ ఉంటుందని ఆశిస్తున్నారు. ఇక, రివ్యూల్లో స్పష్టమైన, వేగవంతమైన నిర్ణయాల కోసం స్మార్ట్‌‌ రీప్లే సిస్టమ్‌‌ను ఉపయోగిస్తారు.