IPL 2024: ముంబై బౌలర్ క్వేనా మఫాకా చెత్త రికార్డు

0
17

ఐపీఎల్ సీజన్-17 ఆడుతున్న అతి పిన్న వయస్కుడు క్వేనా మఫాకా(17) అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబై బౌలర్ 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డులో మూడో స్థానంలో నిలిచారు. 2018లో బసిల్ థంపీ 70, 2023లో యశ్ దయాల్ 69 పరుగులు సమర్పించుకుని టాప్-2లో ఉన్నారు.

నిజానికి మఫాకా ఐపీఎల్ డెబ్యూని చాలా బాగా స్టార్ట్ చేశాడు. తొలి బంతిని వైడ్ గా వేసినా.. ఆ తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. తొలి ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక సీనియర్ బౌలర్ కి సరిసమానం. కానీ, ఆ తర్వాత అంతా మారిపోయింది. హైదరాబాద్ అటాక్ కి మఫాకా బలికాక తప్పలేదు. ట్రావిస్ హెడ్ మొదలుకొని క్లాసెన్ వరకు అందరూ విజృంభించారు. 3 అర్ధ శతకాలు నమోదు అయ్యాయి.

మరోవైపు హోంగ్రౌండ్‌లో సన్ రైజర్స్ అదరగొట్టింది. 5సార్లు ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్‌‌‌ను మట్టికరిపించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 277/3 స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో ముంబై 246/5కే పరిమితమైంది. దీంతో 31 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో SRH నుంచి క్లాసెన్(80), హెడ్(62), అభిషేక్(63) రాణించారు. ముంబైలో తిలక్(64) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయారు