ఐపీఎల్లో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్లో తొలి రోజు చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌ను ‘స్టార్’లో ఏకంగా 16.8 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు ఏ సీజన్లోనైనా తొలి రోజు మ్యాచ్‌ను ఇంతమంది తిలకించడం ఇదే మొదటి సారి. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూశారు. రికార్డు స్థాయిలో 1,276 కోట్ల నిమిషాలు వీక్షించారు.
జియో సినిమా డిజిటల్లో 11.3 కోట్ల మంది మ్యాచ్‌ను తిలకించారు. ఆ రోజు చెన్నై-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తిలకించిన సమయం కూడా 1,276 కోట్ల నిమిషాలుగా నమోదైందట. 2023 సీజన్ తొలిరోజుతో పోలిస్తే ఇది 51 శాతం అధికం.
ఇక ఐపీఎల్లో భాగంగా నేడు ఆర్సీబీ, కేకేఆర్ బెంగళూరులో తలపడనున్నాయి. ఇరువైపులా బలమైన హిట్టర్లు ఉండటం, చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రీడావిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న మ్యాచ్‌తో సహా ఇప్పటి వరకు హోం టీమ్స్ గెలిచాయి. ఈరోజు ఆర్సీబీని మట్టికరిపించి ఆ రికార్డును మార్చాలని భావిస్తోంది కేకేఆర్. అటు ఆర్సీబీ సైతం బలంగానే ఉండటంతో రసవత్తరమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.