రాజస్థాన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగిన రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశారు. ఐపీఎల్ లో ఎక్కువసార్లు(17) డకౌట్ అయిన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్ సరసన చేరారు. 15 డకౌట్లతో మ్యాక్స్‌వెల్, పియూష్ చావ్లా, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ రెండో స్థానంలో ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్:
రోహిత్ శర్మ- 17
దినేశ్ కార్తిక్- 17
గ్లెన్ మ్యాక్స్‌వెల్- 15
పియూష్ చావ్లా- 15
మన్‌దీప్ సింగ్- 15
సునీల్ నరైన్- 15
ఇక ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ కోల్పోయి కేవలం ప్లేయర్‌గానే ఆడుతున్న రోహిత్ శర్మ.. ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లోనూ కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 42.
మరోవైపు ఐపీఎల్‌లో 250 మ్యాచులు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచుతో ఈ మైలురాయిని అందుకుంది. ఇప్పటివరకు 16 సీజన్లలో MI ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా బెంగళూరు (244), ఢిల్లీ (241), కోల్‌కతా (239), పంజాబ్ (235), చెన్నై (228) ఉన్నాయి.