ఐపీఎల్ ఇండియా క్రికెట్ రూపురేఖలనే మార్చేసింది. దేశానికి ఎంతో టాలెంట్ ను అందిస్తోంది. క్రికెట్ అనేది ఓ కెరియర్ గా మార్చిన ఘనత ఐపీఎల్ కే దక్కుతుంది. ఐపీఎల్ ఇండియాలో 2008లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ టోర్నమెంట్ 16 సీజన్లు జరిగాయి.
మొదటి సీజన్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్ళు రిటైర్ అయ్యారు. అయితే మొదటి సీజన్ నుండి ఇంకా ఆడుతున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా మరో ఇద్దరు ఈ జాబితాలో ఉన్నారు. 16 సీజన్లలో ఒక్కో సీజన్ లో వీళ్లు కనీసం 1 మ్యాచ్ ఆడారు. అదే సమయంలో ఇప్పుడు ఈ క్రికెటర్లు 17వ సీజన్‌కు సిద్ధమయ్యారు.
ఐపీఎల్ తొలి సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆడుతున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 237 మ్యాచ్‌లు ఆడాడు. దినేష్ కార్తీక్ IPL 2008లో కింగ్స్ XI పంజాబ్‌లో భాగంగా ఉన్నాడు. అప్పటినుండి అతను వరుసగా 16 సీజన్లలో వివిధ జట్లకు ఆడాడు. శిఖర్ ధావన్ IPL 2008లో ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. శిఖర్ ధావన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ తరపున ఆడాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2008లో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో భాగంగా IPL అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని రికార్డు సృష్టించింది.