టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకా ళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నాడు. తల్లిదండ్రుల తో కలిసి ఇవాళ గుడికి వెళ్లాడు. భస్మా హారతి తర్వాత.. మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వ హించి పండితుల ఆశీర్వచనాలను రాహుల్ అందుకున్నాడు.గతంలో విరాట్ కోహ్లీదంపతులు కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గతేడాది ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్.. ఐపీఎల్ 2023 సీజన్లో కీలక మ్యాచ్ లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కృనాల్ పాండ్యా లక్నో జట్టు పగ్గాలు చేపట్టాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
తొడ కండరాల గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న రాహుల్ టీమిండియా తరఫున రీఎంట్రీ వన్డే ప్రపంచకప్ 2023లో కీపర్‌గానూ రాణించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అతడికి మళ్లీ గాయం తిరగబెట్టింది. దాంతో లండన్ వెళ్లి వైద్య నిపుణులను సంప్రదించాడు. అనంతరం ఎన్‌సీఏలో చేరిని రాహుల్ తాజాగా ఫిట్‌నెస్ సాధించాడు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ హోదాలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రేపు ఐపీఎల్-2024 ప్రారంభం కానుండగా మార్చి 24న రాజస్తాన్ రాయల్స్‌తో లక్నో తొలి మ్యాచ్ ఆడనుంది.