IPL 2024: వి మిస్ యువర్ కెప్టెన్సీ..ధోని,రోహిత్ లపై పోస్టులు

0
23

ఐపీఎల్ లో ధోనీ, రోహిత్ విజయవంతమైన కెప్టెన్లు. చెన్నైకి ధోనీ, ముంబైకి రోహిత్ సుదీర్ఘ కాలం సారథులుగా సేవలందించి అత్యధిక ట్రోఫీలను గెలిపించారు. తాజాగా ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టాస్ సందర్భంగా ధోనీకి షేక్ హ్యాండ్‌ ఇస్తున్న ఫొటోను హిట్‌మ్యాన్ పోస్ట్ చేశారు. దీనిపై ‘ఇద్దరు లెజెండ్‌లను తొలిసారి ప్లేయర్లుగా చూడబోతున్నాం’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ముంబై కెప్టెన్ నుంచి రోహిత్ తప్పించడం, ధోనీ చెన్నై కెప్టెన్ గా తప్పుకోవడంతో ఐపీఎల్‌లో గ్రేటెస్ట్ కెప్టెన్ల శకం ముగిసింది. ముంబై కెప్టెన్‌గా రోహిత్, చెన్నై కెప్టెన్‌గా ధోనీని ఐపీఎల్ లో చూడలేము. వీరిద్దరూ ఐపీఎల్‌లో తమ జట్లకు ఐదేసి ట్రోఫీలను అందించారు. ఐపీఎల్ చరిత్రలో ధోనీ, రోహిత్ కలిసి 10 ట్రోఫీలు గెలవగా.. మిగతా అందరూ కెప్టెన్లు కలిపి 6 గెలిచారు. ఇక వీరి వ్యూహాలను ఇకపై మైదానంలో చూడలేమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ‘వి మిస్ యువర్ కెప్టెన్సీ’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరో వైపు కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. కెప్టెన్ల సమావేశానికి ముందే ఈ విషయం తనకు తెలిసినట్లు చెప్పారు. ధోనీ నిర్ణయాన్ని గౌరవించామన్నారు. మిస్టర్ కూల్ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుందన్నారు. కాగా కెప్టెన్ల ఫొటోషూట్‌లో ధోనీ లేకపోవడంతో ఆయన సారథిగా తప్పుకున్న విషయం బయటకు వచ్చింది. ఫొటోషూట్ తర్వాత కాసేపటికే చెన్నై కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించింది.