Jaiswal Record: సచిన్,కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్

0
11

సొంతగడ్డపై ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్… ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్లోనూ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును (ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ ల్లో అత్యధిక పరుగుల 656) బద్దలు కొట్టి చెరిపేశాడు.

ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. 9వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్ మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. సచిన్… ఆసీస్ పై 74 ఇన్నింగ్స్ 25 సిక్సర్లు బాదితే యశస్వి ఇంగ్లండపై కేవలం 9 ఇన్నింగ్స్ ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు.

అలాగే యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్ లో బౌండరీ బాది టెస్ట్ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి… టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ రికార్డుల్లోకెక్కా డు.

వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్ ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్ గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డ ఇంగ్లండుకు చెందిన సచెఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్ ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు