పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అసెంబ్లీ ఎన్నికలకు 6 స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని ఇప్పటికే పవన్ ప్రకటించారు. తాజాగా మరో 9 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు సమాచారం. పెందుర్తి – పంచకర్ల రమేశ్, ఎలమంచిలి- విజయకుమార్, విశాఖ సౌత్ – వంశీకృష్ణ యాదవ్, తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు. నరసాపురం- బొమ్మిడి నాయకర్, భీమవరం- రామాంజనేయులు, రాజోలు- దేవవరప్రసాద్, తిరుపతి-ఆరణి శ్రీనివాసులు ఉన్నారు.
నిన్న పార్టీ ఆఫీసులో అభ్యర్థులతో భేటీ అయిన పవన్ 2024 ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోరాడుతుందన్నారు. హింస, కక్ష సాధింపు, అరాచకాన్ని నమ్ముకున్న పార్టీతో అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని… కచ్చితంగా గెలిచి తీరాలని అభ్యర్థులకు,కార్యకర్తలకు సూచించారు పవన్.
జనసేన పోటీకి దిగే మరో 6 స్థానాలు ఇవేనా.?
ఇవి కాకుండా కాకినాడ జిల్లాలోని పిఠాపురం, అంబేడ్కర్ కోనసీమ, అమలాపురం, రామచంద్రాపురం, పార్వతీపురం మన్యం, పాలకొండ, కృష్ణా , అవనిగడ్డ. అన్నమయ్య , రైల్వే కోడూరు. ఏలూరు(D) పోలవరం స్థానాల్లో ఆరు చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.